- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పిల్లలు కాలేదని భార్యకు విడాకుల నోటీస్ పంపిన భర్త
దిశ ప్రతినిధి, మేడ్చల్: సంతానం కాలేదని ఓ ప్రబుద్దుడు కట్టుకున్న భార్యకు విడాకుల నోటీసు పంపాడు. భర్త నిర్వాహకం తో ఖంగుతిన్న భార్య న్యాయం కోసం తన ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. ఈ ఘటన కీసర ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. కీసర మండలం, చీర్యాల గ్రామానికి చెందిన ఆనంద్, మహేశ్వరి కి ఆరేళ్ల క్రితం వివాహమైంది. మహేశ్వరి ని అదనపు కట్నం కావాలంటూ.. భర్త ఆనంద్, మామ కృష్ణ యాదవ్, అత్తలు గత కొంతకాలంగా వేధిస్తున్నారు.
దీంతో మహేశ్వరి వారి వేధింపులు భరించలేక పలుమార్లు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే ఇటీవల పండక్కి తన పుట్టింటికి వెళ్లిన మహేశ్వరి కి నీకు పిల్లలు పుట్టడం లేదని, తనకు విడాకులు కావాలని నోటీసు పంపాడు. దీంతో ఆందోళనకు గురైన మహేశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం అత్తగారింటికి వచ్చి, నిలదీసింది. అత్తింటివారు పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం కావాలని ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది. బాధితురాలి మహేశ్వరి మాట్లాడుతూ.. తన మామ కృష్ణ యాదవ్ రాజకీయ పలుకుబడితో అత్తింటి వారు వేధింపులకు పాల్పడుతున్నారని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.