సమాజం కోసమే 'ప్రతిఘటనా' సాహిత్యం

by GSrikanth |
సమాజం కోసమే ప్రతిఘటనా సాహిత్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మనుషులంతా సమానంగా బతికే సమాజం కోసం ప్రతిఘటనా కవిత్వం, ప్రతిఘటనా పోరాటాలని రచయితలు వ్యాఖ్యానించారు. మానవత్వ దీపాన్ని వెలిగించడమే కవిత్వానికి, సాహిత్యానికి ఉన్న ఏకైక ప్రయోజనమని నొక్కిచెప్పారు. నగరంలోని రవీంద్రభారతిలో సోమవారం సాయంత్రం నారాయణస్వామి వెంకటయోగి రచించిన 'పదబంధం' పుస్తకావిష్కరణకు హాజరైన రచయితలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాల గురించీ, నిర్బంధాన్ని ధిక్కరిస్తున్న కవులు, రచయితల గురించి వివరించారు. దేశదేశాల కవిత్వ కరచాలనం శీర్షికతో రాసిన ఈ పుస్తకంలోని ఈ అంశాలన్నింటినీ వక్తలు వివరించారు.

కవులు, రచయితలకు సామాజిక బాధ్యత ఉంటుందని, ఆ విషయంలో రాజీ పడకూడదని, ప్రజల కోసం ధిక్కార స్వరాన్ని వినిపించాల్సిందేనని, అదే ఒక నినాదంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ రమా మెల్కోటే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడగా రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలుగు సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, ప్రముఖ కవి శివారెడ్డి, 'వీక్షణం' సంపాదకులు ఎన్.వేణుగోపాల్, సాంస్కృతిక ఉద్యమ నాయకురాలు విమలక్క, కవులు యాకూబ్, కందుకూరి శ్రీరాములు, ఏలే లక్ష్మణ్, సుధాకిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పుస్తకం గురించి, రచయితల బాధ్యత గురించి ప్రసంగించారు.

Advertisement

Next Story

Most Viewed