- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆ నేతపై కేసు నమోదైనా.. ఎందుకు అరెస్టు చేయడం లేదు..?'
దిశ, వేములవాడ : బీజేపీ నాయకులపై దాడి చేసిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యపై 307 కేసు ఉన్నా.. దర్జాగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాడని, కళ్ల ముందు తిరుగుతున్నా పోలీసులు అతన్ని అరెస్టు చేయడం లేదని బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు, 20వ వార్డు కౌన్సిలర్ సంతోష్ బాబు మండిపడ్డాడు. ఈ మేరకు ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. వేములవాడలో టీఆర్ఎస్ సమావేశానికి హాజరుకానున్న తోట ఆగయ్యను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ నెల 20వ తేదీన ఎల్లారెడ్డి పేటలో పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ నాయకులపై విచక్షణ రహితంగా దాడి చేసిన అతన్ని వదిలేసి.. ప్రతిఘటించిన 26 మంది బీజేపీ నాయకులను రాత్రికి రాత్రే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. దాడి చేసిన అతన్ని వదిలేసి బీజేపీ నాయకులను జైలుకు పంపించడం దారుణమన్నారు. అధికార పార్టీ అండదండలతోనే అతను జల్సాగా తిరుగుతున్నాడని మండిపడ్డారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో (307) కేసు ఉన్నా ఆగయ్యను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. లేదంటే వేములవాడ పరిధిలో టీఆర్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.