- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ పర్యటనలు పెట్టుబడులు తేవడానికి కాదు.. పెట్టడానికే: బీజేపీ
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలు చేసేది తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కాదని, ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకేనని, వాటిని త్వరలోనే బహిర్గతం చేస్తానని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ప్రభాకర్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించారని, తాను వెళ్లిన పర్యటనలన్నీ విజయవంతమైనట్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే భారీగా పెట్టుబడులు వస్తాయనుకుంటే ఇప్పటి వరకు ఒక్క పెట్టుబడి కూడా రాలేదని ప్రభాకర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానం వేసుకుని చైనా వెళ్లారని, వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం డబ్బులు దండుకోవడానికే 111 జీవోను సవరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ఒక అసమర్థుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను మురికి కూపంగా మార్చారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో డబుల్ఇంజన్ సర్కార్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా ప్రజలకు లబ్ధి చేకూరడం లేదన్నారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు టాక్స్ మినహాయింపు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కోరారు.