- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో ఒక మాట మాట్లాడుతుంది: మంత్రి ప్రశాంత్ రెడ్డి
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ వడ్లు కొనుగోలు విషయలో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, బీజేపీ ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను కేంద్రం కొనుగోలు చేయాలి అది వారి బాధ్యత అన్నారు. దేశంలో విపత్కర పరిస్థితి వస్తే కేంద్రం ఆహార నిల్వలను రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి పెట్టాలని రాజ్యాంగ బద్దంగా ఉందని గుర్తు చేశారు.
ఈ రెండేళ్ల నుంచి కేంద్రం తెలంగాణ పై కక్ష పెట్టుకొని పేచీలు పెడుతున్నారని ఆరోపించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీతో పోలిస్తే రెట్టింపు ధాన్యం తెలంగాణలో పండుతుందని, అని కూడా తెలియకుండా రాష్ట్రం కేంద్రానికి సబ్సిడీ ఇవ్వాలని అనడం ఎంపీ అర్వింద్ అవగాహన లోపానికి నిదర్శనమన్నారు. బీజేపీ ప్రజాప్రతినిధులే తీర్మానాలు చేస్తున్నారని, వారికున్న సృహ ఎంపీలకు లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ తలపెట్టే పోరాటంలో రైతులు కలిసి రావాలని రేపటి నుండి 11 వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపి కేంద్రానికి మరోసారి తెలంగాణ దెబ్బ రుచి చూపించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్మన్ విఠల్ రావు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులున్నారు.