డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే జైలుకే.. ప్రభుత్వం కఠిన నిబంధనలు

by Manoj |   ( Updated:2022-04-05 05:54:43.0  )
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే జైలుకే.. ప్రభుత్వం కఠిన నిబంధనలు
X

దిశ, వెబ్ డెస్క్: డ్రంక్ అండ్ డ్రైవ్‌ వల్ల అనేక మంది ప్రమాదాల బారినపడుతున్నారు. ఇదే క్రమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా మందుబాబులను మార్చాలని బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో తొలిసారిగా మద్యం సేవించి పట్టుబడిన వారికి ₹2,000 నుంచి ₹5,000 వరకు జరిమానా విధిస్తామని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో ఈ సవరణను ఆమోదించారు. మొదటిసారి నేరం చేసినవారు జరిమానా చెల్లించకపోతే, వారికి ఒక నెల జైలు శిక్ష విధించబడుతుంది. రెండోసారి మద్యం తాగి పట్టుబడిన వారికి నేరం రుజువైతే ఏడాది పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed