కరోనా ముందు స్థాయికి విమానయాన రంగం.. జ్యోతిరాదిత్య సింధియా

by Harish |
కరోనా ముందు స్థాయికి విమానయాన రంగం.. జ్యోతిరాదిత్య సింధియా
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కొవిడ్ మహామ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో విమానయాన రంగం ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అగ్రశ్రేణి విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్ లిమిటెడ్‌ డిసెంబర్ నుండి త్రైమాసికంలో మంచి లాభాలను నమోదు చేశాయి. స్థానికంగా విమాన ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతుందని, ''వచ్చే ఏడాదిలో 4,15,000 రోజువారీ ప్రయాణీకుల ప్రీ-కొవిడ్ స్థాయిని అధిగమిస్తామని" భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఎయిర్‌షోలో అన్నారు.

చిన్న నగరాల్లో కూడా విమానాశ్రయాలను నిర్మించడం, ఎక్కువ మంది పైలెట్లు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు నిర్వహణ సౌకర్యాలను మెరుగుపరచడం అవసరమని సింధియా చెప్పారు. దీని కోసం కొత్త ఫ్లయింగ్ శిక్షణ పాఠశాలలను ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని దాదాపు 1.4 బిలియన్ల జనాభాలో కేవలం 8% మంది మాత్రమే విమానంలో ప్రయాణిస్తుండగా, రానున్న రోజుల్లో ''విమానాలు సాధారణ రవాణా మార్గంగా మారగలవని'' సింధియా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed