ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ సినిమా చూసేందుకు హాఫ్-డే లీవ్‌!

by Manoj |
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ సినిమా చూసేందుకు హాఫ్-డే లీవ్‌!
X

దిశ, వెబ్‌డెస్క్: కాశ్మీర్ ఫైల్స్ మూవీ విడుదలైన రోజు నుండి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటుంది. దాని ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం కాశ్మీరీ మారణకాండలో కాశ్మీరీ పండిట్‌లు ఎలా దారుణంగా చంపబడ్డారు అనే అంశంపై తెరకెక్కింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం దీనిని ప్రతి ఒక్క పౌరుడు ఈ చిత్రాన్ని చూడాలిని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఒక అడుగు ముందుకేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక ఆఫర్‌తో ముందుకు వచ్చారు. కాశ్మీర్ ఫైల్స్ చూడాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే లీవ్ మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

"మా ప్రభుత్వ ఉద్యోగులు TheKashmirFiles చూడటానికి హాఫ్-డే స్పెషల్ లీవ్‌కు అర్హులని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది" అని శర్మ ట్వీట్ చేశారు. "ఉద్యోగి తమ పై అధికారులకు మాత్రమే తెలియజేయాలి అలాగే మరుసటి రోజు వారు చూసిన టిక్కెట్లను సమర్పించాలి," అని రాసుకొచ్చాడు. ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక, త్రిపుర, హర్యానా, గుజరాత్ అలాగే ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఈ చిత్రానికి పన్ను లేకుండా చేశాయి. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కాశ్మీర్ ఫైల్స్‌'లో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

Next Story