- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. వయో పరిమితిలో భారీ సడలింపు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నందున కొన్ని సడలింపులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలు మాత్రమే ఉండగా ఇప్పుడు పదేళ్ల సడలింపు ఇచ్చింది. రెండేళ్ల వరకు ఈ సడలింపు అమల్లో ఉంటుందని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలో విడుదల కానున్న జాబ్ నోటిఫికేషన్లకు 44 ఏళ్ల వయసున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. పోలీసు, జైళ్లు, ఎక్సైజ్, ఫారెస్టు, ఫైర్ తదితర యూనిఫామ్ సర్వీసులకు దేహదారుఢ్య (ఫిజికల్) పరీక్షలు కూడా ప్రామాణికం కానున్నందున వీటికి పై సడలింపు వర్తించదని సీఎస్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు.
సాధారణ కేటగిరీ (ఓపెన్)కి ఈ గరిష్ట వయో పరిమిత సడలింపులు ఇచ్చినందున ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ప్రత్యేకంగా ఉన్న అదనపు సడలింపులు కూడా వర్తిస్తాయని క్లారిటీ ఇచ్చారు. ఈ జీవోను 2020 మార్చి 19న జారీ చేసినందున సడలింపులు 2024 మార్చి 18వ తేదీ వరకు జరిగే అన్ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లకు వర్తించనున్నాయి.