- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ట్రెండింగ్‌లో ఉంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’.. జానీ మాస్టర్ షాకింగ్ పోస్ట్..
దిశ, సినిమా: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు జానీ జీవితాన్నే తారుమారు చేసేసింది. పరువు, గౌరవం, చాన్స్‌లు ఇలా అన్ని పోయాయి అనే చెప్పాలి. ఇక ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు కూడా వెళ్లాడు. అయితే జానీ మాస్టర్ భార్య బెయిల్ కోసం ప్రయత్నించగా మొదట బెయిల్ వద్దన్న ఆయన.. ఆ తర్వాత తన తల్లి అనారోగ్యం కారణంగా బయటకు రావాలని కోర్టుకు కోరాడు. అప్పుడు జానీ బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది. ఇక ఎంతో ప్రయత్నించగా.. నిన్ననే జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చింది. ఇక వచ్చి రాగానే జానీ తన తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకొని.. ఆమె ఆశీర్వాదాలు తీసుకొని ఫొటో పెడతాడు అనుకుంటే.. తాను కొరియోగ్రఫీ చేసిన సాంగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను షేర్ చేసి షాక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..
లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోక ముందు జానీ మాస్టర్ ఎన్నో మంచి ప్రాజెక్ట్స్‌ను ఒప్పుకున్నాడు. అందులో ‘పుష్ప 2’, ‘భూల్ భులయ్యా 3’ కూడా ఉన్నాయి. అయితే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ కేసు వలన ‘పుష్ప 2’ నుంచి జానీను తొలగించినట్టు తెలిపారు. ఇక హిందీలో ‘భూల్ భులయ్యా3’లో టైటిల్ ట్రాక్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. హరే రామ్.. హరే రామ్ అంటూ సాగిన ఈ సాంగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింలో ఉంది. ఆ స్టెప్స్ వేరే లెవల్ అనే చెప్పవచ్చు.
అయితే తాజాగా ఈ సాంగ్ రికార్డులు సృష్టించడంతో జానీ మాస్టర్ తన ఆనందాన్ని అందరితో పంచుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అంతేకాక ‘నా సాంగ్ స్పూకీ సైడ్‌ను ట్రెండింగ్‌లో ఉంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొస్తూ ‘భూల్ భులయ్యా3’ టీమ్‌ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
(video link credits to johnny master instagram id)