- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీవ్ర ఉద్రిక్తత.. ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు
దిశ, పాలకుర్తి: నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు బుధవారం రెచ్చిపోయారు. పోటాపోటిగా నినాధాలు చేసుకుంటూ పరస్పర దాడులకు దిగారు. వివరాల్లోకి వెళితే.. రాజీవ్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంతో ఆయన చిత్రాపటానికి క్షీరాభిషేకం చేసి, టపాసులు కాల్చీ సంబురాలు జరుపుకున్నారు. సమీపంలో ఉన్న బీజేపీ నాయకులు ప్రభుత్వానికి వ్వతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడానికి వచ్చారు. వారిని చూసి టీఆర్ఎస్ నాయకులు మోడీ డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేశారు. అది చూసిన బీజేపీ నాయకులు కేసీఆర్ డౌన్.. డౌన్.. నినాదాలతో నాయకులు రెచ్చిపోయి ఒకరిపై ఒకరుదాడులకు పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు పది నిమిషాలపాటు ఇరువర్గాలను శాంతింప చేసి, అనంతరం బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తరలించినవారిలో బీజేపీ మండల అధ్యక్షుడు కమ్మగాని శ్రీకాంత్, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి మహేందర్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పెనుగొండ సోమేశ్వర్, మండల ప్రధాన కార్యదర్శి మారం రవి, అవీరినేని రామరావు, నిరంజన్ రెడ్డిలు ఉన్నారు.