తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ రిలీజ్.. తేదీలివే

by Satheesh |
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ రిలీజ్.. తేదీలివే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్‌తో పాటు పీజీ ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. ఒకే రోజు కాకుండా మొత్తం ఐదు రోజుల్లో ఎంసెట్ పరీక్ష జరపనున్నారు. ఈ సందర్భంగా జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో మొదటి రెండు తేదీలు(14,15) అగ్రికల్చర్ ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష జరగనుండగా.. మిగతా మూడు రోజుల్లో (18,19,20) తేదీల్లో ఇంజనీరింగ్ కోర్సుకు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఇక జులై 13న ఈసెట్ జరగనుంది.

Advertisement

Next Story