- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిప్రెషన్ : అమ్మాయి, అబ్బాయి మధ్య ఆ తేడా ఎందుకు?
దిశ, ఫీచర్స్ : సాధారణంగా డిప్రెషన్ అన్ని వయసుల వారిని వేధిస్తుంది. కానీ ప్రస్తుతం.. పిల్లలు, కౌమారదశస్తులతో పాటు యుక్తవయస్కుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి టీనేజర్స్‌లో డిప్రెషన్‌ను తీవ్ర మానసిక సమస్యగా చెప్పొచ్చు. ఇది నిరంతరం విచారాన్ని, యాక్టివిటీస్‌పై ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది. బాధితుల్లో భావోద్వేగ, క్రియాత్మక, శారీరక ఆరోగ్య సమస్యలను కలిగించడమే కాక వారి ఆలోచనలు, అనుభూతులు, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ఇది వయసుతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. పైగా పెద్దల కంటే టీనేజర్స్‌లో విభిన్న లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. ఇక టీనేజ్‌కు ముందు బాలబాలికల్లో మానసిక రుగ్మతల ప్రాబల్యం దాదాపు సమానంగా(3 -5 శాతం) ఉన్నా.. యుక్తవయసు మధ్యలో మూడ్ డిజార్డర్స్‌తో బాధపడే అవకాశం అమ్మాయిల్లో రెట్టింపు అవుతుంది.
అమ్మాయి, అబ్బాయి మధ్య తేడా ఎందుకు?
భావోద్వేగ గుర్తింపు పరంగా అబ్బాయిల కంటే అమ్మాయిలే మెరుగ్గా, వేగంగా మెచ్యూరిటీ సాధిస్తారు. అయితే సున్నిత స్వభావమే వారిని నిరాశ, ఆందోళనకు గురి చేస్తుంది. యుక్తవయసు అమ్మాయిలు సాధారణంగా తమకు ఇష్టమైన పనులు చేయడం మానేసినట్లయితే డిప్రెషన్‌కు ప్రాథమిక లక్షణంగా గుర్తించవచ్చు. అంతేకాదు వారి మానసిక ప్రవర్తనకు సంబంధించి విచారం, చిరాకును ప్రదర్శించడంతో పాటు ఆకలి, ఎనర్జీ లెవెల్స్, నిద్రా విధానాలు, అకడమిక్ పర్ఫార్మెన్స్‌లోనూ మార్పులు చోటుచేసుకోవచ్చు.
ప్రమాద కారకాలు ఏమిటి?
ఆత్మన్యూనత, పూర్ బాడీ ఇమేజ్, అత్యంత స్వీయ విమర్శనాత్మక ధోరణి, ప్రతికూల సంఘటనలతో వ్యవహరించేటప్పుడు నిస్సహాయంగా భావించడం వంటివి టీనేజ్ గర్ల్స్‌లో డిప్రెషన్‌కు ప్రమాద కారకాలుగా ఉంటాయి. యుక్త వయసులో హార్మోన్స్ హెచ్చుతగ్గులు, పెరిగిన స్వేచ్ఛ పట్ల సందిగ్ధతకు తోడు ఇతర మూడ్ డిజార్డర్స్ కూడా శారీరక మార్పుల ఒత్తిడితో సంబంధం కలిగి ఉంటాయి. అదనంగా తల్లిదండ్రులు, సహచరులు, ఇతరులతో తమ సంబంధాల్లో వచ్చిన మార్పులే కాక అభివృద్ధి చెందుతున్న లైంగికత, గుర్తింపు సమస్యల కారణంగానూ ప్రభావితమవుతారు. డిప్రెషన్ అనేది పర్యావరణ ఒత్తిళ్లకు కూడా ప్రతిస్పందనగా ఉండవచ్చు. ఇందులో మాటలు, శారీరక లేదా లైంగిక వేధింపులు, ప్రియమైన వ్యక్తి మరణం, పాఠశాల సమస్యలు లేదా తోటివారి బెదిరింపులు ఒత్తిడికి గురిచేయవచ్చు.
టీనేజ్ గర్ల్స్ డిప్రెషన్ సిగ్నల్స్ :
* నిరంతరం ప్రతికూల మానసిక స్థితి
* పాఠశాలలో సమస్యలు
* కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం
* తక్కువ ఆత్మగౌరవం
* స్మార్ట్‌ఫోన్ లేదా సోషల్ మీడియా వ్యసనం
* నిర్లక్ష్యపు ప్రవర్తన, పారిపోవడం, కోపంతో అరవడం
* డ్రగ్ లేదా ఆల్కహాల్ దుర్వినియోగం
కారణాలు:
1. టీనేజ్ ప్రారంభ దశలోనే అమ్మాయిలు యుక్తవయసుకు చేరుకుంటారు. హార్మోన్ల మార్పులు కొంతమంది అమ్మాయిల్లో నిరాశను పెంచుతాయి. మానసికంగా కలిగే ఇలాంటి తాత్కాలిక కల్లోలం సాధారణమే అయినా ఈ మార్పులు మాత్రమే నిరాశను కలిగించవు.
2. ఆడపిల్లలు ఇతరుల అభిప్రాయం పట్ల మరింత సున్నితంగా ఉండాలని లేదా ఏడుపు, సున్నితమైన ప్రవర్తనలు ప్రదర్శించడం ద్వారా తమను తాము వ్యక్తపరచడాన్ని నేర్పించబడతారు.
3. మన సమాజాల్లో విలువను తగ్గించే పాత్రలను ఆడపిల్లలకు ఇస్తారు.
4. బాలికలు మరింత భావోద్వేగ-కేంద్రీకృతమైన, రూమినేటివ్ కోపింగ్ స్టైల్‌ను ఉపయోగిస్తారు. ఇందులో తమ సమస్యలను మనసులోనే ఉంచుకోవడం కూడా ఉంటుంది. అబ్బాయిలు మాత్రం తమ సమస్యలు మరచిపోయేందుకు సమస్యా-కేంద్రీకృత, అపసవ్య కోపింగ్ శైలిని ఉపయోగిస్తారు.
5. జీవితకాలంలో మహిళలు/అమ్మాయిలు ఎక్కువ ఒత్తిడితో కూడిన జీవిత సంఘటనలను అనుభవించవచ్చు. పైగా అబ్బాయిల కంటే ఎక్కువ సున్నితత్వాన్ని కలిగి ఉంటారు.
6. ఊపిరి సలపని పని/అకడమిక్ ఒత్తిడి, చదువులకు సంబంధించిన అంచనాలు ఆడవారికే ఎక్కువగా ఉంటాయి.
ఇలా డిప్రెషన్‌కు సంబంధించి ఏవైనా సంకేతాలను కలిగిఉంటే వెంటనే సహాయం తీసుకోవాలి. టీనేజర్ డిప్రెషన్ లక్షణాల రకం, తీవ్రతపై చికిత్స ఆధారపడి ఉంటుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న చాలా మంది టీనేజర్లకు టాక్ థెరపీ(కౌన్సెలింగ్, సైకోథెరపీ), మందుల కలయిక చాలా ప్రభావవంతంగా ఉంటుంది.