అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున టీచర్ల ధర్నా

by Nagaya |
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున టీచర్ల ధర్నా
X

దిశ, తెలంగాణ బ్యూరో : భార్యాభర్తలకు ఒకే చోట ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ 13 జిల్లాల నుంచి మహిళా ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. మంగళవారం పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చంటి పిల్లలతో సహా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ''చెరొక జిల్లాలో ఉద్యోగం.. పిల్లల భవిష్యత్తు గందరగోళం'' తదితర డిమాండ్లతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఎండలోనే కూర్చొని ప్రభుత్వం న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులను భారీగా మోహరించినప్పటికీ.. శాంతియుత ధర్నాతో మిన్నకుండిపోయారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ చేస్తూనే.. మరోపక్క భార్యాభర్తలకు ఒకే దగ్గర ఒకే జిల్లాలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.





Advertisement

Next Story