- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిప్యూటీ సీఎంపై ప్రివిలేజ్ నోటీసిచ్చిన టీడీపీ ఎమ్మెల్సీలు
దిశ, ఏపీ బ్యూరో: డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామిపై మండలి చైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. మండలి నియమావళి రూల్ 173 ప్రకారం చైర్మన్ కు నోటీసులు అందజేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అసెంబ్లీలో నారాయణ స్వామి దూషించారంటూ టీడీపీ ఎమ్మెల్సీలు నోటీసులో ఆరోపించారు. సభలో లేని వ్యక్తిని విమర్శించడం తగదని అన్నారు. రూల్ 291(ii) నిబంధన పాటించలేదని టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
నోటీసులో ఏముందంటే 'అసెంబ్లీలో సోమవారం ఐఎంఎఫ్ఎల్ చట్ట సవరణ చేస్తున్నప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ... నారా లోకేశ్‌ను దూషించారు. అయినప్పటికీ తోటి సభ్యులు గానీ, స్పీకర్ గానీ నిరోధించలేదు. నియమం 291(ii)ప్రకారం ఒక సభ్యుడు ఇంకొక సభ్యుడు గురించి మట్లాడకూడదన్న విషయాన్ని పాటించలేదు అని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి' అని లేఖలో కోరారు.