'హోమ్ సెక్యూరిటీ' కెమెరాలను లాంచ్ చేసిన టాటా ప్లే!

by Manoj |
హోమ్ సెక్యూరిటీ కెమెరాలను లాంచ్ చేసిన టాటా ప్లే!
X

దిశ, ఫీచర్స్ : కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ టాటా ప్లే కొత్తగా హోమ్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌లోకి ప్రవేశించింది. ఈ మేరకు ఇల్లు, కార్యాలయ భద్రత కోసం టాటా ప్లే సెక్యూర్, టాటా ప్లే సెక్యూర్+ పేరుతో రెండు కొత్త సెక్యూరిటీ కెమెరాలను లాంచ్ చేసింది. టాటా ప్లే సెక్యూర్ జూన్ 28 నుంచి తమ సబ్‌స్క్రైబర్స్‌కు అందుబాటులో ఉండనుండగా, ప్రారంభించిన మొదటి దశలో ముంబై, నవీ ముంబై, థానే, పూణే, హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ + NCR, లక్నో, జైపూర్‌తో సహా 10కి పైగా నగరాల్లో దీని సేవలు వినియోగించుకోవచ్చు.

టాటా ప్లే తమ సబ్‌స్క్రైబర్స్ కోసం గూగుల్ నెస్ట్ సెక్యూరిటీ కెమెరాను భారతదేశానికి తీసుకొచ్చేందుకు గూగుల్‌తో కలిసి పనిచేసింది. Tata Play Secure+ అనేది బ్యాటరీతో నడిచే Google Nest Cam కాగా ఇది వ్యక్తులు/జంతువులు/వాహనాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతర్నిర్మిత మైక్రోఫోన్ స్పీకర్ ద్వారా టూ-వే కమ్యూనికేషన్ చేయొచ్చు. బ్యాటరీతో వర్క్ చేసే ఈ కెమెరాలు పవర్ లేదా Wi-Fi అంతరాయం ఏర్పడినప్పుడు కూడా రికార్డ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. Tata Play Secure+లో కూడా ఫేస్ రికగ్నేషన్, 30/60-రోజుల ఈవెంట్ వీడియో హిస్టరీతో పాటు మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్నాయి. Nest Cam (బ్యాటరీ)తో విక్రయించే Nest Aware సర్వీస్ బేసిక్ ప్లాన్ ధర ₹3,000 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియం ప్లాన్ సంవత్సరానికి ₹5,000 నుంచి ప్రారంభమవుతుంది.

Advertisement

Next Story

Most Viewed