- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 8.1 లక్షలతో టాటా 'ఆల్ట్రోజ్' ఆటోమెటిక్ వేరియంట్ విడుదల!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ మోడల్‌లో డ్యుయెల్ క్లచ్ ఆటోమెటిక్(డీసీఏ) వేరియంట్‌ను సోమవారం మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 8.10 లక్షలుగా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. టాప్ వేరియంట్ ధర రూ. 9.90 లక్షలని పేర్కొంది. ఈ కారు కోసం ఇప్పటికే రూ. 21,000 చెల్లించి బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించామని, కంపెనీ వెబ్‌సైట్ లేదంటే డీలర్‌షిప్‌ల వద్ద సంప్రదించాలని తెలిపింది.
ఈ నెలాఖరు నుంచి వినియోగదారులకు డెలివరీ చేయనున్నట్లు కంపెనీ వివరించింది. టాటా ఆల్ట్రోజ్ ఇప్పటివరకు కేవలం మాన్యూవల్ గేర్‌బాక్స్ వేరియంట్‌తో మాత్రమే లభిస్తోంది. ఇప్పుడు ఇందులో ఆటోమేటిక్ కూడా రావడంతో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలుంటుంది. అలాగే, ఈ వేరియంట్‌లో రెడ్, అవెన్యూ వైట్, హార్బర్ బ్లూ, ఆర్కెడ్ గ్రే, ఒపెరా బ్లూ రంగుల్లో లభిస్తాయి.
సరికొత్త ఆల్ట్రోజ్ ఆటోమెటిక్ వేరియంట్‌లో వాడిన గేర్‌బాక్స్ అత్యాధునిక డ్యుయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్. ఇది ప్రత్యేకంగా దేశీయ వినియోగదారుల కోసం రూపొందించామని, అంతేకాకుండా ఈ వేరియంట్ కోసం కంపెనీ 45 పేటెంట్‌లతో కొత్త టెక్నాలజీ, ప్లానెటరీ గేర్ సిస్టమ్ రూపొందించిన మొదటి డ్యుయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ అని కంపెనీ వెల్లడించింది. కొత్త ఆల్ట్రోజ్ వేరియంట్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న బలెనో 2022, హ్యూండాయ్ ఐ20, హోండా జాజ్, గ్లాంజా 2022 వంటి ఆటోమెటిక్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు గట్టి పోటీనివ్వనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.