- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి
దిశ, కంది : భారత ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న 'ఆయుష్ గ్రామ్' కార్యక్రమంలో భాగంగా అందిస్తున్న ఉచిత సేవలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఆయుష్ ప్రోగ్రాం కమిషనర్ అలుగు వర్షిణి సూచించారు. గురువారం కంది మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జెఎస్‌పిఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత వైద్య సేవలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వైద్యుల సూచన మేరకు చికిత్స పొంది అవసరమైన మందులు వాడి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు.
అనంతరం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఈ ఉచిత వైద్య సేవలను కంది గ్రామం తో పాటు ఇతర గ్రామాల ప్రజలు కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంది గ్రామంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉచిత వైద్య సేవలు పూర్తయిన తర్వాత సంగారెడ్డి లోని ప్రభుత్వ హోమియో వైద్యశాలలో కూడా ప్రజలు పొందే అవకాశం ఉంటుందని ప్రోగ్రామ్ ఆఫీసర్ పార్థసారథి చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విమల వీరేశం, ఎంపీపీ సరళ పుల్లారెడ్డి, జెడ్‌పీటీసీ కొండల్ రెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మణ్ గౌడ్, నందకిషోర్, డాక్టర్ శ్యాంసుందర్ ప్రసాద్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.