- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'చక్ దే ఇండియా' మమ్మల్ని ప్రేరేపించింది : తాప్సీ
దిశ, సినిమా: సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ పన్ను నటించిన తాజా చిత్రం 'శభాష్ మిథు'. ఈ నెల 15న విడుదల కానుండగా ప్రమోషన్స్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించింది తాప్సీ. 2007లో విడుదలైన 'చక్ దే ఇండియా' మూవీనే మిథాలి బయోపిక్‌లో ఉత్తమంగా నటించేందుకు తనను ప్రేరేపించినట్లు చెప్పింది. అంతేకాదు షూటింగ్ సమయంలో మరింత ఉత్సాహం పొందేందుకు చాలాసార్లు 'చక్ దే ఇండియా' సినిమా చూశానన్న నటి.. 'ఆ సినిమాలో షారుఖ్ ప్రసంగం మొదటిసారి విన్నప్పుడు ఇటుక గోడల వెంట పరుగెత్తడానికి సిద్ధంగా ఉన్నాను. అదొక ఐకానిక్ మూవ్‌మెంట్ అండ్ క్లాసిక్. నాకు ప్రోత్సాహం లేదా ప్రేరణ అవసరమైనప్పుడల్లా ఇదే చిత్రం చూస్తున్నా. 'శభాష్ మిథు' క్లైమాక్స్‌ను చిత్రీకరించే ముందు నా సహోద్యోగులు, కలిసి నటిస్తున్న అమ్మాయిలకు చక్ దే చూడాలని చెప్పాను. నిజంగా మాకు ఆ మూవీ చాలా సాయపడింది' అంటూ వివరించింది. ఇక ఈ సినిమా ఇండియన్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.