Anushka Shetty: అనుష్క ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న కొత్త సినిమా పోస్టర్

by Hamsa |   ( Updated:2024-11-08 12:34:00.0  )
Anushka Shetty: అనుష్క ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న కొత్త సినిమా పోస్టర్
X

దిశ, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించిన అనుష్క శెట్టి(Anushka Shetty) స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. మరీ ముఖ్యంగా ‘బాహుబలి’(Bahubali)తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సడెన్‌గా సినిమాలకు దూరం అయింది. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr. Polishetty) సినిమాతో మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రజెంట్ ఈ అమ్మడు ‘ఘాటీ’(Ghaati) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దీనికి క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్(UV Creations) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది థియేటర్స్‌లో గ్రాండ్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, అనుష్క శెట్టి పుట్టినరోజు (నవంబర్ 7) కావడంతో మేకర్స్ ‘ఘాటీ’(Ghaati) అప్డేట్‌ను రిలీజ్ చేశారు.

అనుష్క ఫస్ట్ లుక్‌ను నెట్టింట షేర్ చేసి గూస్ బంప్స్(Goose Bumps) తెప్పించారు. ఈ పోస్టర్‌లో స్వీటీ తల, చేతికి రక్తంతో ఉండగా చుట్ట తాగుతూ.. భయపెట్టేలా ఫస్ట్ లుక్(First Look) ఉంది. అయితే ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు గ్లింప్స్‌(glimpse) కూడా విడుదల కాబోతున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. ప్రజెంట్ అనుష్క శెట్టి(Anushka Shetty) లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed