IPL-22: ప్లేఆఫ్‌‌కు వెళ్లే జట్లు ఇవే.. సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
IPL-22: ప్లేఆఫ్‌‌కు వెళ్లే జట్లు ఇవే.. సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన 15వ సీజన్ ఐపీఎల్ఎట్టకేలకు అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే, ప్రారంభంలోనే మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని జట్లు కనీసం ఒక్కో మ్యాచ్ కూడా ఆడకముందే ప్లే ఆఫ్‌కు వెళ్లే జట్లు ఇవే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆఫ్‌కు వెళ్తాయని జోస్యం చెప్పారు. దీనితో మిగితా ఆరు జట్ల అభిమానులు సునీల్ గవాస్కర్‌పై మండిపడుతున్నారు. తమ జట్టే ప్లే ఆఫ్‌కు వెళ్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story