- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alia Bhatt: చిన్నప్పటి నుంచి ఆ సమస్యతో బాధపడుతున్నా..అలియా ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt)బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల ఈ అమ్మడు ‘జిగ్రా’(jigra) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి టాలీవుడ్ సినీ స్టార్స్ అంతా అలియాకు సపోర్ట్‌గా నిలిచారు. అంతేకాకుండా పోస్టులు పెట్టి మరీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. అయితే ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా(Alia Bhatt) తన అనారోగ్య సమస్య గురించి బయట పెట్టింది. ‘‘నేను చిన్నప్పటి నుంచి హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతున్నాను. అయినదానికీ కానీ దానికి టెన్షన్ పడిపోవడం నా బలహీనత. ఒక్కోసారి ఈ విషయంలో నేను నియంత్రణ కోల్పోతుంటా. ఈ విషయం తెలిసి కూడా నన్ను రణ్‌బీర్(Ranbir Kapoor) పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండేళ్ల క్రితం క్రిస్మస్ టైమ్‌లో నా భర్తతో కలిసి బయటకు వెళ్లాను. అప్పుడు అనుకోకుండా ఈ సమస్య వచ్చింది. దీంతో రణ్‌బీర్(Ranbir Kapoor) నన్ను కంట్రోల్ చేశాడు.
అయితే మా కూతురికి ‘రాహా’ (Raha)అని పేరు పెట్టిన తర్వాత మీడియా ముందుకు తీసుకువచ్చి అందరికీ చూపిద్దామని అనుకున్నాము. కానీ నా సమస్య వల్లే అది కుదరలేదు. నిజానికి ఇది కనిపించనంత పెద్ద సమస్య. దాన్ని భరించే వాళ్లకు ఓర్పు అవసరం. నేను హైపర్ టెన్షన్‌కు గురైన ప్రతిసారీ రణ్‌బీర్(Ranbir Kapoor) తెలివిగా టాపిక్ డైవర్ట్ చేసి నేను నార్మల్ అయ్యేలా చేస్తాడు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అలియా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.