- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు
దిశ, యాచారం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బి.ఎన్. రెడ్డి ట్రస్ట్ సహకారంతో జ్యోతి ఎడ్యుకేటెడ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు శుక్రవారంతో ముగిశాయి. క్రీడలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ బహుమతుల ప్రధానోత్సవంలో బి.ఎన్. రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొని విజేతలకు ట్రస్ట్ తరుపున బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి రూ. 25 వేలు యశ్వంత్ టీం, రెండవ బహుమతి రూ. 10 వేలు రంగాపూర్, మూడవ బహుమతి రూ. 5 వేలు సరూర్ నగర్ టీమ్ లు గెలుపొందాయి.
అనంతరం చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో మరింతగా రాణించాలని, గ్రామీణ క్రీడాకారులకు తమ ట్రస్ట్ తరపున సహకారం ఉంటుందని అన్నారు. త్వరలో నందివనపర్తి ప్రీమియర్ లీగ్ -2 క్రీడాపోటీలు ట్రస్ట్ తరుపున నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి యూత్ అధ్యక్షులు గుణమోని గణేష్, మరియు వార్డు సభ్యులు, యూత్ సభ్యులు వేంకటేశ్వర్లు, మహేందర్ నరసింహ, రాఘవేందర్, రమేష్, గౌర శేఖర్, మేకం శంకర్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.