పంచాయతీ లీడర్లకి ఆయుధ లైసెన్స్.. అంతా సిద్ధం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం

by Javid Pasha |
పంచాయతీ లీడర్లకి ఆయుధ లైసెన్స్.. అంతా సిద్ధం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ రాజ్ నేతకు ఆయుధ లైనెస్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని బీహార్ పంచాయతీరాజ్ మంత్రి సామ్రాట్ చౌదరి అన్నారు. అయితే 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో అనేక మంది ప్రజా ప్రతినిధులు మరణించారని, దానిని దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రతి ప్రజా ప్రతినిధి లైసెన్స్ కోసం డీఎం (డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్) సమక్షంలో దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత వారి ధరఖాస్తులు హోం శాఖకు సిఫార్సు చేయబడతాయని ఆయన పేర్కొన్నారు. దీనిని కొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయుధ లైసెన్సులు ఇస్తే ప్రజలను చంపేందుకు ప్రజాప్రతినిధులకు సర్వహక్కులు ఇచ్చినట్లే అని అంటున్నారు.



Advertisement

Next Story

Most Viewed