48 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..? ఎట్టకేలకు ఆ ప్రముఖ హీరోతో రిలేషన్ పై క్లారిటీ..

by Kavitha |   ( Updated:2024-11-16 05:56:28.0  )
48 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..? ఎట్టకేలకు ఆ ప్రముఖ హీరోతో రిలేషన్ పై క్లారిటీ..
X

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దాదాపు స్టార్ హీరో లందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అలా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక అంతా బాగానే ఉంది అని అనుకున్న టైంలో మీనా జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త అనారోగ్యం కారణంగా మరణించారు. దీంతో మానసికంగా కుంగిపోయింది. ప్రస్తుతం ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. గత కొన్నాళ్లుగా మీనా రెండో పెళ్లిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ రూమర్స్ పై మీనా తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా తన రెండో పెళ్లిపై వస్తున్న రూమర్స్ పై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ‘'సోషల్ మీడియాలో ఏదో ఒకటి రాయాలి. ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేయాలని కొంతమంది ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. తమిళ్ హీరో ధనుష్‌తో ఇతర హీరోలతో ట్యాగ్ చేస్తూ.. పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు. మొయిన్‌గా హీరో ధనుష్‌తో పెళ్లి చేసుకోబోతుంది అనే రూమర్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఆయన సింగిల్‌గా ఉన్నారని అలా రాస్తున్నారు. అతడే కాకుండా.. ఇండస్ట్రీలో చాలా మంది సింగిల్‌గా ఉన్నారు.

వాళ్లతో కూడా కలిసి వార్తలు రాసేలా ఉన్నారు. వార్తలు లేకపోతే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను ప్రస్తుతం దేని గురించి ఆలోచించడం లేదు. సాధ్యమైనంత వరకు ఒంటరిగానే జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాను. నాకు ఓ కూతురు ఉంది. నా కూతురు నైనిక విద్యాసాగర్ భవిష్యత్ నాకు ముఖ్యం. నా జీవితంలో ఏం జరిగితే.. అలా నేను ముందుకు సాగుతాను" అని మీనా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ అన్నింటికీ ఓ మంచి క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం మీనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed