మోక్షజ్ఞ సినిమాలో విలన్‌గా స్టార్ హీరో..? ఇక రికార్డులు తిరగరాయాల్సిందే..!

by Kavitha |   ( Updated:2024-10-25 15:08:37.0  )
మోక్షజ్ఞ సినిమాలో విలన్‌గా స్టార్ హీరో..? ఇక రికార్డులు తిరగరాయాల్సిందే..!
X

దిశ, సినిమా: నందమూరి వారసుడు మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇటీవల విడుదల అయింది. ఈ మూవీకు ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్‌ విజయం సాధించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మైథలాజికల్ టచ్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకు ‘సింబ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ చిత్రం బాలయ్య సొంత బ్యానర్‌లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న సంగతి విదితమే. కాగా ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన విషయాలను అయితే వెల్లడించలేదు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

మోక్షజ్ఞ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో విలన్‌గా స్టార్ హీరో రానా దగ్గుబాటి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రానా హీరోగా కంటే విలన్ పాత్రలకే ఎక్కువ కమిట్ అవుతున్నారు. ఇక ఈయన విలన్ పాత్రలో చేస్తున్న మూవీలన్ని మంచి హిట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినిమాలో కూడా విలన్ పాత్రలో ఈయనే నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. నందమూరి అభిమానులు.. రానా విలన్‌గా నటిస్తున్నాడంటే హీరో పాత్ర కూడా చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతుందని, ఇలా వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అంటే ఈ సినిమా రికార్డులను తిరగ రాస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.


👉Also Read: Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సినిమాలో స్టార్ హీరోయిన్ కూతురు ఫిక్స్!

Advertisement

Next Story