- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
DFCCIL: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( DFCCIL ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రిక్రూట్‌మెంట్ లో జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్), ఎగ్జిక్యూటివ్ (సివిల్), ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) , ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలికాం), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు దరఖాస్తు కోరుతోంది. 10వ తరగతి, ITI, డిప్లొమా, CA ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 18-01-2025న ప్రారంభమై 22-03-2025న ముగుస్తుంది. అభ్యర్థి DFCCIL వెబ్‌సైట్ లింక్ dfccil.com పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (DFCCIL) MTS, ఎగ్జిక్యూటివ్ & జూనియర్ మేనేజర్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము :
జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ (ఎగ్జిక్యూటివ్) వారికి: రూ. 1000/-
జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ (ఎంటీఎస్) వారికి: రూ. 500/-
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్ఎం వారికి: లేదు
ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 18-01-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ: 16-02-2025
దరఖాస్తు ఫారమ్ సవరణ కోసం " విండో ” తెరిచే తేదీలు: 31-03-2025 నుండి 04-04-2025 వరకు
1వ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) షెడ్యూల్: జూలై, 2025
2వ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) షెడ్యూల్: నవంబర్, 2025
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) షెడ్యూల్: జనవరి/ఫిబ్రవరి, 2026
పొడిగించిన చివరి తేదీ: 22-03-2025
వయోపరిమితి :
కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం :
జూనియర్ మేనేజర్ - స్కేల్ రూ. 50,000-1,60,000 (E2 లెవెల్, IDA పే స్కేల్)
ఎగ్జిక్యూటివ్ - స్కేల్ రూ. 30,000-1,20,000 (E0 లెవెల్, IDA పే స్కేల్)
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - స్కేల్ రూ. 16,000-45,000 (N-1 లెవెల్, IDA పే స్కేల్)
ఖాళీల వివరాలు :
జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్) - 03
అర్హత : CA/ CMA
ఎగ్జిక్యూటివ్ (సివిల్) - 36
అర్హత : డిప్లొమా (సివిల్)
ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) - 64
అర్హత : డిప్లొమా (ఎలక్ట్రికల్)
ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలికాం) - 75
అర్హత : డిప్లొమా (సంబంధిత ఫీల్డ్)
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 464
అర్హత : 10వ తరగతి, ITI ఉత్తీర్ణత