రామగుండం ఎరువుల కర్మాగారంలో నిలిచిపోయిన ఉత్పత్తి

by Nagaya |
రామగుండం ఎరువుల కర్మాగారంలో నిలిచిపోయిన ఉత్పత్తి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షాలతో ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తిని బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఈదురు గాలులకు అమ్మోనియా యూనిట్, ఆర్సీ యూనిట్, బ్యాంగింగ్ యూనిట్లలో పైకప్పులు కొట్టుకుపోవడంతో ఉత్పత్తి చేయడానికి విఘాతం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. కన్వేయర్ ప్రాంతానికి వరద నీరు భారీగా చేరటంతో 50 వేల యూరియా బస్తాలు నీటిలో తడిచి కరిగిపోయాయి. దీంతో ఆర్‌ఎఫ్‌సీఎల్ యజమాన్యం ఉత్పత్తిని నిలిపివేసింది. నాసిరకం పనుల వల్లే పై కప్పులు కొట్టుకుపోయి ఉంటాయని భావిస్తున్నారు. అర్థాంతరంగా ఉత్పత్తిని నిలిపివేయడంతో ఆరు రాష్టాలకు ఎరువుల సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed