- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి పర్యటనలో వైద్యులు బిజీ.. అప్పుడే పుట్టిన బిడ్డకు క్లిప్ పెట్టడం మరిచిపోయిన సిబ్బంది
దిశ, మంచిర్యాల: మంత్రి రాకతో వైద్యలు, అధికారులు ఆదమరచి పర్యటనలో మునిగిపోయారు. మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందు బొడ్డుకు పెట్టే క్లిప్ ప్రభుత్వ దవాఖానాలో లేకపోవడంతో వైద్య సిబ్బంది సొంత వైద్యాన్ని ప్రదర్శించారు. బొడ్డు పెట్టే క్లిప్ బదులు దారంతో బొడ్డు ముడి వేయగా కొంత సమయానికి పసికందుకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. గమనించిన సిబ్బంది పసికందు బంధువుకు ఒక చిట్టి రాసి బొడ్డు పెట్టే క్లిప్ ను బయట మెడికల్ షాప్ నుంచి తెప్పించి పెట్టారు. పసికందుకు నంజు ఉందని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే దిశగా అడుగులు వేస్తుంటే కొందరు వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారని సిటిజన్లు మండిపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ దవాఖాన లోపలికి వ్యక్తి మోటర్ సైకిల్ తో వెళ్లి చక్కర్లు కొడుతూ హల్ చల్ సృష్టించాడు. ఆ వ్యక్తిని సెక్యూరిటీ గార్డులు గానీ, ఆస్పత్రి సిబ్బంది గానీ అడ్డుకోకపోవడం ఆసుపత్రిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.