- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు సెక్స్ కోరికలు లేవని చెప్పలేదు : సీరియల్ నటి
దిశ, సినిమా : ప్రముఖ నటి, 'కుంకుమ్ భాగ్య' సీరియల్ ఫేమ్ శ్రుతి ఝా.. తను రాసిన అలైంగికత(Asexuality) పద్యం పట్ల ఎదుర్కొంటున్న నెగెటివ్ కామెంట్లపై స్పందించింది. ముంబైలోని కొమ్యూన్ స్పోకెన్ ఫెస్ట్‌లో నిర్వహించిన 'కన్ఫెషన్స్ ఆఫ్ ఏ రొమాంటిక్ అసెక్సువల్'లో భాగంగా ఆమె ఈ పద్యం రాయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే తన పోయెమ్పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టింది శ్రుతి.
ఈ పద్యం తనకోసం రాసుకోలేదని, ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ గురించి రాసినప్పటికీ తనకు కొన్ని విషయాల్లో సాయపడిందని తెలిపింది. అయితే ఇందులో రాసిన అర్థాల ఆధారంగా కొంతమంది ఇది తన గురించేనని భావించడం సరికాదని చెప్పింది. అంతేకాదు ఈ కవిత ఎంతోమందికి ఓదార్పునిచ్చిందన్న శ్రుతి.. మొదట్లో ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ ఇబ్బందులను అర్థం చేసుకోలేకపోయానని, ఇతరుల వలె తప్పుగా అర్థం చేసుకున్నానని స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ దశను దాటినట్లు తెలిపిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న రియాలిటీ టీవీ షో 'ఖత్రోన్ కే ఖిలాడి 12' షూటింగ్లో బిజీగా ఉంది.