'ఈ స్థాయిలో రైతు ఆత్మహత్యలు ప్రపంచంలో ఎక్కడా లేవు'

by GSrikanth |
ఈ స్థాయిలో రైతు ఆత్మహత్యలు ప్రపంచంలో ఎక్కడా లేవు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మొదటి ప్రాధాన్యతతో రైతులందరికీ వారి ప్రైవేటు అప్పులు తీర్చడానికి బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ అప్పుల అధిక వడ్డీ భారం నుంచి కాపాడాలని కోరారు. ఈ మేరకు బుధవారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత దేశంలో గత మూడు దశాబ్దాల కాలంలో నాలుగు లక్షలకు పైగా రైతులు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మెజారిటీ సందర్భాల్లో రైతుల ఆత్మహత్యలకు వారి ప్రైవేట్ అప్పుల అధిక వడ్డీ భారం ప్రధాన కారణమని తెలిపారు. బ్యాంకులు ఇచ్చే రుణాలు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. రైతుల లాభాలు రెట్టింపు చేస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చే దిశగా అడుగు వేసినట్లవుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed