Sri Lanka: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

by Mahesh |   ( Updated:2022-07-13 07:21:10.0  )
Sri Lanka PM Declares state of emergency
X

దిశ, వెబ్‌డెస్క్: Sri Lanka PM Declares state of emergency| శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మాల్దీవులకు పారిపోవడంతో శ్రీలంకలో అత్యవసర ఎమర్జెన్సీ ప్రకటించబడింది. ఈ నిర్ణయాన్ని ప్రధాని మంత్రి కార్యాలయం అధికారికంగా తెలిపింది. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా గత కొన్ని రోజులుగా లంకలో అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీలంక అధ్యక్షుడి ఇంటిని నిరసన కారులు ముట్టడించారు.

దీంతో గోటబయ రాజపక్సే మాల్దీవులకు పారిపోయినట్లు తెలుస్తుంది. అయితే వేలాదిమంది నిరసనకారులు మాత్రం రాజపక్సేవెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే కార్యాలయం దగ్గర ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

Also Read: 19 మంది చిన్నారుల్ని బ‌లిగొన్న టెక్సాస్ స్కూల్ కాల్పుల‌ మొద‌టి వీడియో ఇదే!

Advertisement

Next Story

Most Viewed