రంగు మారిన స్ప్రైట్ బాటిల్‌.. దాని వెనుక ఓ ఆస‌క్తిక‌ర‌ కార‌ణం

by Sumithra |
రంగు మారిన స్ప్రైట్ బాటిల్‌.. దాని వెనుక ఓ ఆస‌క్తిక‌ర‌ కార‌ణం
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కూల్ డ్రింక్స్‌లో స్ప్రైట్‌కు ఒక‌ ప్ర‌త్యేక‌త ఉంటుంది. రిఫ్రెషింగ్ టేస్ట్‌తో పాటు దాని సిగ్నేచ‌ర్ అయిన‌ ఆకుపచ్చ బాటిల్ ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంది. 1961లో USలో ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి 60 సంవత్సరాలకు పైగా స్ప్రైట్ బాటిల్‌కు ఇదే రంగు వాడుకలో ఉంది. అయితే, ఇప్పుడు అది ట్రాన్స్‌ప‌రెంట్‌లోకి మారింది. ఇక‌, Sprite మాతృ సంస్థ అయిన Coca-Cola Co., బుధవారం ఒక ప్రకటనలో కొత్త డిజైన్ ఆగస్ట్ 1 నుండి విడుదల కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. స్పష్టమైన కంటైనర్‌తో భర్తీ అయిన ఈ బాటిల్ వెనుక ఒక ప్ర‌త్యేక కార‌ణ‌మే ఉంది. "ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కోసం స‌ర్క్యుల‌ర్‌ ఆర్థిక వ్యవస్థకు స‌హ‌క‌రించే" ప్రయత్నంలో ఇలా మార్చిన‌ట్లు కంపెనీ తెలిపింది.

ప్రస్తుత ఆకుపచ్చ ప్లాస్టిక్‌ను పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET)తో తయారు చేసేవారు. ఇది సింగిల్-యూజ్ వ‌స్తువులా మారుతుంది. అయితే, కొత్త బాటిళ్లకు ఆకుపచ్చ రంగు కంటే ట్రాన్స్‌ప‌రెంట్‌ ప్లాస్టిక్ వాడ‌టం వ‌ల్ల, బాటిల్‌ను తిరిగి ఉపయోగించడం సులభమని కంపెనీ తెలిపింది. "రీసైకిల్ చేసేట‌ప్పుడు ఇలా ఉండ‌టం వ‌ల్ల పెట్ బాటిళ్ల‌ను కొత్త బాటిల్స్‌గా మార్చ‌డం సులువు" అని కంపెనీ పేర్కొంది. అలాగే, 100% రీసైక్లింగ్ ప్లాస్టిక్ వ‌ల్ల‌ ప‌ర్యావ‌ర‌ణానికి కొంత మేలు జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. అయితే, స్ప్రైట్ క్యాన్లు, ప్యాకేజింగ్ గ్రాఫిక్స్ ఇప్పటికీ ఆకుపచ్చగానే ఉంటాయ‌ని, దాని లోగో మారుతుందని ప్ర‌క‌టించారు.

Advertisement

Next Story

Most Viewed