- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. కన్నతల్లినే కడతేర్చిన కసాయి కొడుకు
దిశ,నిజామాబాద్ రూరల్: తాగుడికి బానిస ఆ మత్తులో కన్న తల్లిని కడతేర్చిన దుర్ఘటన నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం తిమ్మన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ వో లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. అంజమ్మ అతని తనయుడు గంగేశ్వర్ రూరల్ మండలం తిమ్మన్ పల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి నివసిస్తున్నారు. గంగేశ్వర్‌కు గత 4 సంవత్సరాల క్రితం సంధ్య అనే అమ్మాయితో వివాహం జరిగింది. గంగేశ్వర్ తాగుడుకి బానిసై భార్య సంధ్యను విపరీతంగా కొట్టడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దీంతో మితిమీరి తాగుడుకు బానిసైన గంగేశ్వర్ తన భార్యను తిరిగి తన ఇంటికి తీసుకు రమ్మని తల్లి అంజమ్మతో సోమవారం సాయంత్రం తీవ్రంగా గొడవ పడ్డాడు.
వారిద్దిరి మధ్య వాగ్వాదం పెద్దదైంది. దాంతో అప్పటికే పీకలదాక తాగి ఉన్న గంగేశ్వర్ రొట్టెల కర్రతో తల్లి తలపై గట్టిగా కొట్టాడు. దాంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గంగేశ్వర్‌ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు అంజమ్మ మేనల్లుడు గైని మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత అంజమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు ఎస్‌హెచ్‌వో లింబాద్రి తెలిపారు. అంజమ్మ మృతితో తిమ్మన్ పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.