- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మల్లన్న' వెలిశాడుంటూ ఆ పని చేస్తున్నారు.. కాపాడమంటున్న రైతు
దిశ, అందోల్ : భూముల విలువ పెరిగిన కొద్ది అక్రమార్కుల ఆగడాలు ఆగడం లేదు. భూమిని కబ్జా చేసేందుకు దేవుడి పేరును సైతం వాడుకునేందుకు వెనకాడడం లేదు. వ్యవసాయ భూమిలో మల్లన్న దేవుడి విగ్రహం వెలిసిదంటూ. కొత్తగా తయారు చేయించిన విగ్రహన్ని ఏర్పాటు చేసి.. ఆ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని.. తన భూమిని కాపాడాలంటూ అధికారులకు ఓ రైతు మొరపెట్టుకుంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డి పల్లికి చెందిన పట్లోళ్ల ఏసంతికి గ్రామ శివారులో 237 సర్వే నెంబర్ లో 2-16 ఎకరాల భూమి ఉంది.
ఈ భూమిని ఎలాగైనా కబ్జా చేయాలన్న దురుద్దేశంతో ఆ మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులు మంతూరి శశికుమార్, బుచ్చయ్యలు ఈ భూమిలో ఫిబ్రవరి 13న మల్లన్న స్వామి విగ్రహం బయటపడిదంటూ ప్రచారం చేసి.. పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించినట్లు బాధిత రైతు తెలిపాడు. ఈ విషయంపై తహశీల్దార్, పోలీసులను సంప్రదించిన ప్రయోజనం లేకపోవడంతో.. పురావస్తు, దేవదాయ శాఖ అధికారులను కలిసానని, బయటపడిన ఆ విగ్రహం ఏర్పాటు చేసిందని, ఒక్కసారి పరిశీలించాలని కోరినట్టు బాధితుడు తెలిపాడు.
ఈ మేరకు అధికారులు ఘటనా స్థలానికి వచ్చి విగ్రహాన్ని పరిశీలించి, పురాతన విగ్రహం కాదని.. ఇటీవల తయారు చేయించిందని నిర్ధారించి పత్రాన్ని కూడా అందజేసినట్లు బాధితుడు తెలిపాడు. పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించిన పత్రాన్ని తహశీల్ధార్‌కు, పోలీసులకు అందజేసి, తన భూమిని తనకు దక్కెలా చూడాలని, తనకు న్యాయం చేయాలని, విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరితే.. అధికారులు పట్టించుకోవడంలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులైనా.. స్పందించి వెంటనే తనకు న్యాయం చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.