- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ భూముల జోలికి వస్తే ఊరుకునేదే లేదు.. కాంగ్రెస్ నాయకుల స్ట్రాంగ్ వార్నింగ్..
దిశ, పరిగి: దేవాలయ భూములను టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తూ, మట్టిని అక్రమంగా తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ డీసీసీ ప్రధాన కార్యదర్శి కె. హనుమంతు ముదిరాజ్, పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి పరశురామ్ రెడ్డి, నాయకులు లాల్ కృష్ణ ప్రసాద్, ఫ్లోర్ లీడర్ జరుపుల శ్రీనివాస్ తప్పుబట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో ఉన్న గోపాలనాథ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు పూడూరు మండలం చంగముల్‌లోని సర్వే నెం.48లో 14 ఎకరాల 28 గుంటల భూమి ఉందన్నారు. ఈ భూమి పక్కనే చేవెళ్ల ఘనపూర్‌కు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు భూమిని కొనుగోలు చేశాడు. ఆలయానికి సంబంధించిన భూమి నుండి మట్టి తవ్వుకుంటూ, యదేచ్ఛగా ఆలయ భూముల్లో రోడ్డు వేసుకున్నాడు అంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆలయ భూములు కాపాడాలంటూ గోపాలనాథ స్వామి ఆలయం ముందు కాంగ్రెస్ నాయకులు శనివారం నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు స్పందించి ఆలయ భూములు కాపాడాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ భూములను కబ్జా చేసేందుకు గోపాల నాథ ఆలయం ఉంటే గోపాల నాథుడు అనే మనిషిని సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకోగా రామ్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ రద్దు చేయించారన్నారు. మళ్లీ ఇప్పుడు ఈ భూములను స్థానిక నాయకుల లోపాయకారి ఒప్పందంతోనే మట్టి తవ్వుతున్నారని ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ధరణి పేరుతో అమాయకుల భూములను ఆన్లైన్ లెక్కించేందుకు లక్షల దోచుకుంటూ పాలకులు పంచుకుంటున్నారని విమర్శించారు. దేవాలయ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ పల్లి కృష్ణ, సర్పంచ్ అశోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగ వర్ధన్, జంగయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.