- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రెండ్ ఫాలో కాని స్మగ్లర్స్.. ఖమ్మం జిల్లాలో గంజాయి రవాణ.. మాములుగా లేదుగా..!
దిశ, వెబ్ డెస్క్ : గతకొన్నాళ్లుగా హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్‌కు బానిసై ఓ యువకుడు ప్రాణం కోల్పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రముఖల పిల్లలు పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో రాష్ట్రంలో డ్రగ్స్‌పై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. డ్రగ్స్, గంజాయి రాష్ట్రంలో పూర్తిగా నివారించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. దాంతో ఏమాత్రం అనుమానం వచ్చినా వారిని తనిఖీలు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం సినిమా పక్కీలో పోలీసుల కళ్లు గప్పి వీటిని తరలిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా కొందరు 250 కిలోల గంజాయిని తరలిస్తు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం బుర్హన్పురంలో రాజస్థాన్‌కు చెందిన లారీలో గంజాయి ఎక్కిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇదే క్రమంలో ట్రాక్టర్ కింద భాగంలో కూడా అరలు చేసి గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. నిందుతుల్లో ముగ్గురు రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు ఉపయోగించిన రెండు ట్రాక్టర్లను, ఒక లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.