Smile depression: స్మైల్ డిప్రెషన్ అంటే ఏంటి.. లక్షణాలు?

by Anjali |
Smile depression: స్మైల్ డిప్రెషన్ అంటే ఏంటి.. లక్షణాలు?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక సమస్యలతో సఫర్ అవుతున్నారు. మారుతోన్న, జీవనశైలి(Lifestyle), నిద్రలేమి(sleeplessness), ఒత్తిడి(stress) కారణంగా ఎన్నో ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. ఇందులో స్మైల్ డిప్రెషన్ ఒకటి. మరీ ఒక వ్యక్తి తన అంతర్గత దు:కాన్ని, స్ట్రెస్‌ను దాచుకోడానికి బయటి ప్రపంచం ముందు ఎప్పుడూ నవ్వుతూ ఉండే మెంటల్ సిష్యూవేషనే(Mental situation) స్మైల్ డిప్రెషన్. క్లారిటీగా చెప్పాలంటే బాధను తమ మనసులోనే దాచుకోవడం. నలుగురిలో ఆనందంగా కనిపించాలని ప్రయత్నాలు చేయడం. లోపల ఒత్తిడి, నిరాశ లాంటి సమస్యలతో బాధపడుతుండటం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు.

ఇక స్మైల్ డిప్రెషన్ లక్షణాలు చూసినట్లైతే.. అతిగా నిద్రపోవడం(Oversleeping), ఎనర్జీ లాస్ అవ్వడం(Loss of energy), అధికంగా తినడం.. వీటితో పాటు ఫేస్ లో చిరునవ్వు కొనసాగించేటప్పుడు కూడా ఎలోన్‌గా, నిరాశకు గురవ్వడం(Getting frustrated) వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్మైల్ డిప్రెషన్ మానసిక ఆరోగ్యాన్ని(Mental health) దెబ్బతీస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది సంబంధాలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది.

అలాగే వృత్తి విషయంలో కూడా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరంతరం భావోద్వేగాలను దాచడం వల్ల ఒక వ్యక్తి టైడ్ అయి.. స్ట్రెస్ కు గురవుతాడు. అంతేకాకుండా కొన్ని సార్లు సూసైడ్ అటెంప్ట్(Suicide attempt) వంటివి కూడా చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story