Chinese Manja :పాతబస్తీలో టాస్క్ ఫోర్సు దాడులు..చైనా మంజా పట్టివేత

by Y. Venkata Narasimha Reddy |
Chinese Manja :పాతబస్తీలో టాస్క్ ఫోర్సు దాడులు..చైనా మంజా పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్ : పతంగుల పండుగ సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ శాఖ (Police Department)అప్రమత్తమైంది. మనుషులకు, పక్షులకు ప్రాణంతంగా మారిన నిషేధిత చైనా మంజా(Chinese Manja) అమ్మకాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్సు(Special Task Force)లను పోలీస్ శాఖ రంగంలోకి దింపింది. హైదరాబాద్ పాతబస్తీలో టాస్క్ ఫోర్సు పోలీసులు పతంగుల విక్రయ దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిషేధిత ప్రమాదకరమైన 10లక్షల విలువైన చైనా మాంజా పట్టుబడింది. అక్రమంగా చైనా మంజాను విక్రరయిస్తున్నా 15మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిన్న మంగళ్ హట్, గోషామహల్, అబీడ్స్ పరిధిలో దాడులు చేసి 22మందిని అరెస్టు చేసి 18కేసులు నమోదు చేశారు. ఏటా చైనా మాంజా బారిన పడి ఎక్కడో ఓ చోట ప్రాణ నష్టం జరుగుతోంది. తాజాగా ఖమ్మం జిల్లాలో సైతం ద్విచక్ర వాహనంపై వెలుతున్న వ్యక్తి మెడకు చైనా మంజా బిగుసుకుని తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. గత ఏడాది జనవరిలో లంగర్‌హౌజ్‌ ఫ్లైవోర్‌ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆర్మీ జవాన్ కాగితాల కోటేశ్వర్‌రెడికి చైనా మాంజా మెడకు తగిలి చనిపోయాడు.

Advertisement

Next Story