ప్రధాని రేసులో దూసుకెళ్తున్న రిషి

by Mahesh |   ( Updated:2022-07-19 17:04:36.0  )
ప్రధాని రేసులో దూసుకెళ్తున్న రిషి
X

లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణ అల్లుడు రిషి సునాక్ దూసుకెళ్తున్నారు. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ ఓటింగ్‌లోనూ అత్యధికంగా 118 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల ఓట్లు దక్కించుకుని, ప్రధాని పీఠానికి కేవలం మూడు అడుగుల దూరంలో నిలిచారు. రిషి తర్వాతి స్థానంలో బ్రిటన్ మాజీ రక్షణ మంత్రి పెన్నీ మోర్డాంట్ (92 ఓట్లు), విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ (86 ఓట్లు) నిలిచారు. నలుగురిలో అతి తక్కువ ఓట్లు(59) సాధించిన కెమి బడెనోచ్ ప్రధాని రేసు నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక, బుధవారం జరిగే ఐదో రౌండ్‌లో మరొకరు ఎలిమినేట్ అవుతారు.

చివరికి మిగిలిన ఇద్దరు అభ్యర్థులు.. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 16వేల మంది సభ్యుల ఓట్లు పొందనున్నారు. ఆగస్టు చివరి వారంలో పోస్టల్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో అత్యధిక ఓట్లు పొందినవారు బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. కాగా, మంత్రుల ఒత్తిడి నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed