ముభావంగా ఉన్నావేంటమ్మా అని అడిగిన తల్లి.. పదేపదే అత్యాచారం చేస్తున్నారని చెప్పడంతో షాక్

by S Gopi |
ముభావంగా ఉన్నావేంటమ్మా అని అడిగిన తల్లి.. పదేపదే అత్యాచారం చేస్తున్నారని చెప్పడంతో షాక్
X

దిశ, వెబ్ డెస్క్: నమ్మి తనతోపాటు ఇంటికి వచ్చిన ఓ యువతిపై స్నేహితుడు అత్యాచారం చేసి, అదంతా కూడా వీడియో తీసి ఎవరికైనా చెబితే వీడియో లీక్ చేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా అతని ఫ్రెండ్స్ కూడా ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ చురలోని కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ యువతిని తన స్వేహితుడు కలిశాడు. అనంతరం వారిద్దరూ కలిసి ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్లారు. ఆ తర్వాత ఆ యువతిని ఆ యువకుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అతను ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదంతా కూడా వీడియో తీశాడు. విషయం ఎవరికైనా చెబితే వీడియో లీక్ చేస్తానని బెదిరించాడు. అనంతరం ఆ విషయాన్ని తన ఫ్రెండ్స్ కు చెప్పాడు. దీంతో వారు కూడా ఆ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుందామని ఇంట్లో బాధతో ఉంది. ఆమెను గమనించిన తల్లి ముభావంగా ఉన్నావేంటమ్మా అని అడిగింది. దీంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లితో చెప్పి బోరున విలపించింది. అనంతరం తల్లి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed