- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛీ కొట్టినా.. జై కొట్టినా.. ముందుకెళ్లే రాముడు : ఆర్జీవీని పొగిడేసిన సిరాశ్రీ
దిశ, సినిమా: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు 60వ వడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆర్జీవీకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సినీ గేయ రచయిత సిరాశ్రీ ఓ ట్వీట్ చేశారు. 'ఆర్జీవీ సర్ జీ.. సైకిల్ చైనుతో సినిమా.. సైకీనే మార్చివేసి చరితాత్ముండై.. జైకొట్టినా ఛీకొట్టినా.. రాకెట్టుగా దూసుకెళ్లు రాముండితడే..' అంటూ పోస్టు చేశాడు. అయితే దీనిపై తన స్టైల్‌లో స్పందించిన వర్మ.. 'బాగానే ఉంది కానీ రావణుడితో పోల్చితేనే నేను మరింత సుఖంగా ఉంటాను' అని రిప్లై ఇచ్చారు. ఇక ఆర్జీవీ చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. 'హ్యప్పీ బర్త్‌డే చెబుదాం అనుకున్నాను కానీ, నేను చెప్పినా చెప్పకపోయినా నీ లైఫ్‌లో నువ్వు హ్యాపీగా ఉంటావు. పుట్టుక మీద నీకు ఆశ లేదు కాబట్టి బర్త్‌డే విషెస్ నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. అయినా మీ జీవితంలో ఒక్క ఏడాది ఈ రోజుతో కోల్పోతున్నావనేది నిజం' అంటూ విభిన్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
All well but I will be more comfortable in comparison with Ravana https://t.co/KgwFVxjlbF
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022