కోహ్లీ భారీ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయాస్ అయ్యర్

by Disha News Desk |
కోహ్లీ భారీ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయాస్ అయ్యర్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ ల T20 ద్వైపాక్షిక సిరీస్‌ ను టీమ్ ఇండియా 3-0 తో వైట్ వాష్ చేసింది. ఈ మ్యాచ్ విజయం తో భారత్ వరుసగా 12 వ T20 విజయాన్ని సాధించింది. ఈ సీరిస్ లో యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యార్ వరుసగా మూడు మ్యచ్‌లలో నాట్ అవుట్‌గా 57, 74, 73, స్కోర్‌లతో మొత్తం 204 పరుగులు చేసి.. మ్యాన్ ఆఫ్ ది సీరీస్ కైవసం చేసుకున్నాడు. ఈ మైలురాయిని అందుకున్న తొలి భారతీయుడు కోహ్లీ మాత్రమే 2012లో తొలిసారిగా 3 బ్యాక్ టు బ్యాక్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌లు సాధించాడు. అలాగే 2016 లో ఆస్ట్రేలియా పై విరాట్ కోహ్లీ 199 పరుగులు చేసి మరో మైలురాయి అందుకున్నడు. వరుసగా 50 పైగా స్కోర్‌లతో శ్రేయస్ అయ్యార్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మరియు KL రాహుల్‌ ఎలైట్ జాబితాలో చేరాడు.

2018 లో కోహ్లీ తో పాటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో చేరాడు. అలాగే భరత్ ఓపెనర్ రాహుల్ వరుస ఆఫ్ సెంచరీలు చేసి ఈ మైలురాయిని రెండుసార్లు సాధించారు. ఒక సిరీస్‌లో 3 బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు(నాట్ అవుట్)గా సాధించిన ఇద్దరు భారతీయ బ్యాట్స్‌మెన్‌లు వీరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మాత్రమే. అయ్యర్ శ్రీలంక T20 సిరీస్‌లో వరుసగా నాట్ ఆవుట్‌గా మూడు హాఫ్ సెంచరీ స్కోర్‌లతో ఈ ఫీట్ ను సాదించిన 2వ బ్యాటర్‌గా శ్రేయస్ ఆయ్యర్ నిలిచాడు. కాగా ఈ ఫీట్‌ను ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2019లో శ్రీలంకపై ఈ సాధించాడు.

Advertisement

Next Story