- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిస్ వరల్డ్ రన్నరప్‌గా భారత సంతతి మహిళ.. ముఖంపై గాయాలతోనే
దిశ, సినిమా: అంతర్జాతీయ మహిళా 2021 అందాల పోటీలు ముగిశాయి. ప్యూర్టోరికోలోని షాన్‌జువాన్‌లో జరిగిన ఈ 70వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో పోలాండ్‌కి చెందిన కరోలినా బిలావ్‌స్కా విజేతగా నిలవగా.. యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన భారతీయ-అమెరికన్ 'శ్రీ సైనీ' రన్నరప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే కోవిడ్-19 కారణంగా ఆలస్యమైన ఈ పోటీ మార్చి 16న ముగియగా.. అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి మహిళగా షైనీ గుర్తింపు పొందడం గమనార్హం.
ఇక ఈ కిరీటం గెలుచుకోవడం పై స్పందించిన శ్రీ సైనీ.. '12 ఏళ్ల వయసులో జరిగిన కారు ప్రమాదంలో ముఖం ఎడమవైపు భాగం అంతా కొట్టుకుపోయింది. అయినప్పటికీ పట్టుదలతో కష్టాలను అధిగమించి ఈ కిరీటాన్ని గెలుచుకున్నాను. అందాల పోటీల్లో పాల్గొనాలనేది నా చిన్నప్పటి కల. ఆరేళ్ల వయసులో ప్రపంచ సుందరి వేషం వేసుకుని మురిసిపోయాను' అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈ విజయం తర్వాత ఆనంద భాష్పాలు కూడా రాల్చలేకపోయానన్న సైనీ.. తాను భరించిన నొప్పి, గాయాల నుంచి బయటపడే లోపు కన్నీళ్లు అయిపోయాయని ఇంకా బతికుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది.