కన్నుల పండువగా శివకళ్యాణమహోత్సవం

by GSrikanth |
కన్నుల పండువగా శివకళ్యాణమహోత్సవం
X

దిశ, వేములవాడ: శివ కళ్యాణ మహోత్సవం సందర్భంగా రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాలు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం వృషభ యాగం, ధ్వజారోహణం, ఎదుర్కోళ్ళు, అనంతరం కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణోత్సవం అభిజిత్ లగ్నంలో కన్నుల పండుగగా ఆలయ అర్చకులు నిర్వహించారు. దేవస్థానం తరుపున ఆలయ ఈఓ ఎల్.రమాదేవి మున్సిపల్ కార్పొరేషన్ తరుపున చైర్పర్సన్ రామతీర్తపు మాధవీలు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణ సీఐ వెంకటేష్ పటిష్ట బందోబస్తు నిర్వహించారు.





Advertisement

Next Story

Most Viewed