తను నీది.. సో ఆమెను జాగ్రత్తగా చూసుకో.. బాడ్మింటన్ స్టార్ ప్లేయర్‌కు నేషనల్ క్రష్ స్వీట్ వార్నింగ్

by Kavitha |   ( Updated:2024-11-03 06:32:45.0  )
తను నీది.. సో ఆమెను జాగ్రత్తగా చూసుకో.. బాడ్మింటన్ స్టార్ ప్లేయర్‌కు నేషనల్ క్రష్ స్వీట్ వార్నింగ్
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సుకుమార్(Sukumar), అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప’(Pushpa) మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప2’(Pushpa 2)లో నటిస్తోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే, బాడ్మింటన్ స్టార్ ప్లేయర్(Badminton Player) కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) త్వరలోనే ఓ ఇంటి కాబోతున్నాడనే సంగతి తెలిసిందే. ఈయన టాలీవుడ్ స్టార్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ(Shravya Varma)ను పెళ్లి చేసుకోనున్నారు. అయితే ఇటీవల శ్రావ్య ఇచ్చిన బ్యాచిలరేట్‌ పార్టీలో నటి రష్మిక (Rashmika), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) పాల్గొన్నారు. కాబోయే వధువుతో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని శ్రావ్య తన ఇన్‌స్టా(Instagram) వేదికగా షేర్‌ చేస్తూ ''నా గర్ల్‌ గ్యాంగ్‌తో సింగిల్‌గా ఇదే నా లాస్ట్‌ వీకెండ్‌'' అని పేర్కొన్నారు. దీనిపై రష్మిక స్పందించారు. ''శ్రావ్య వర్మ మేడమ్‌ పెళ్లి చేసుకోనున్నారు. శ్రీకాంత్‌ కిదాంబి.. ఇకపై తను నీది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకో. ఓకే'' అని తెలిపారు. దీనికి శ్రీకాంత్ స్పందిస్తూ.. ''మహారాణిలా చూసుకుంటా''నని బదులిచ్చారు.

కాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మేనకోడలే శ్రావ్య వర్మ. ఈమె ప్రస్తుతం రష్మిక కథానాయికగా నటిస్తోన్న 'ది గర్ల్‌ఫ్రెండ్‌' సినిమాకు స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నారు. అలాగే కీర్తిసురేశ్‌ నటించిన 'గుడ్‌ లఖ్‌ సఖి' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు.


Next Story

Most Viewed