మోకాళ్ల పై కూర్చుని దండం పెట్టిన హీరో.. పోస్ట్ వైరల్

by Disha Desk |
మోకాళ్ల పై కూర్చుని దండం పెట్టిన హీరో.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: శర్వానంద్ - రష్మిక జంటగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడులైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సోమవారం మూవీ షూటింగ్ కూడా పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్‌. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ కొత్త పోస్టర్‌ రిలీజ్ చేశారు. కాబోయే భార్యకు, ఆమెతో ఉన్న ఆడపడుచులకు పెళ్లి పందిట్లో మోకాళ్ల పై కూర్చుని నమస్కరిస్తూ శర్వానంద్ కనిపించగా.. ప్రముఖ సీనియర్ నటీమణులు రాధిక, ఖుష్బూ, ఊర్వశీ, ఝాన్సీ తదితరులు నవ్వుతూ ఆటపట్టిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఫిబ్రవరి 25న ప్రంపచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు కీలక పాత్రలో కనిపించనుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

https://twitter.com/SLVCinemasOffl/status/1493186855528853512?s=20&t=BK6QydbIObkUBAl7S2gDUg


Advertisement

Next Story