నిండు సభలో ఎంపీ కవితకు అవమానం.. అందరూ చూస్తుండగానే..

by Mahesh |   ( Updated:2023-12-15 17:12:34.0  )
నిండు సభలో ఎంపీ కవితకు అవమానం.. అందరూ చూస్తుండగానే..
X

దిశ, మహబూబాబాద్ టౌన్: రైతులు యాసంగిలో పండించిన ధాన్యం‌ను కేంద్రం కొనుగోలు చేయాలంటూ.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్షలో జిల్లా తెరాస అధ్యకురాలు, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షరాలు ఎంపీ కవిత రైతు దీక్షలో మాట్లాడుతుంటే మధ్యలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ ను లాక్కోవడం తో కవిత బిత్తరపోయింది. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షతన అనగానే.. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అలా కాదు..పార్టీ జిల్లా అధ్యక్షరాలు కవిత అధ్యక్షతన అనాలి అని. మంత్రికి సూచించారు. మరోవైపు తహశీల్దార్ కార్యాలయం గేటుకు అడ్డంగా టీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టడం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారు, రహదారిపై ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిబంధనలల్ని ప్రతిపక్ష పార్టీలకే నా.. అధికార పార్టీకి ఈ నిబంధనలు వర్తించవా అని ప్రజలు చర్చించుకోవడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed