45 దాటిన పెళ్లి వేధింపులు తప్పట్లేదు.. లేఖలు పంపిస్తూనే ఉన్నారు..

by samatah |
45 దాటిన పెళ్లి వేధింపులు తప్పట్లేదు.. లేఖలు పంపిస్తూనే ఉన్నారు..
X

దిశ, సినిమా : కొలంబియన్ స్టార్ సింగర్ షకీరా మాజీ భర్త సాకర్ ప్లేయర్ గెరార్డ్ పిక్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తన నుంచి విడిపోయిన తర్వాత కూడా వేధింపులకు గురవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బార్సిలోనాలో నివాసం ఉంటున్నట్లు తెలిపిన గాయని.. తన రెసిడెన్సీకి తరచుగా పెళ్లి చేసుకోమంటూ కొంతమంది లేఖలు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపిన షకీరా.. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని కోరింది. ఇక 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ‌కప్‌ పోటీల సమయంలో గెరార్డ్‌తో ప్రేమలో పడ్డ సింగర్ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే తన ఫ్రెండ్‌తోనే భర్త డేటింగ్ చేస్తున్నట్లు గుర్తించి డివోర్స్ ఇచ్చేసింది.

Advertisement

Next Story