సెక్సువల్‌గా వేధిస్తే ట్రైన్ జర్నీ బ్యాన్.. నిర్ణయానికి మహిళల సలామ్

by Manoj |
సెక్సువల్‌గా వేధిస్తే ట్రైన్ జర్నీ బ్యాన్.. నిర్ణయానికి మహిళల సలామ్
X

దిశ, ఫీచర్స్: రైల్వే ఏజెన్సీ పీటీ కెరెటా అపీ ఇండోనేషియా(PT KAI) తీసుకున్న నిర్ణయం ఆ దేశ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ట్రైన్‌లో అమ్మాయిలను లైంగికంగా వేధిస్తే.. అలాంటి వారిని మరోసారి రైలు ఎక్కకుండా బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మధ్య ఓ సెక్స్ పెస్ట్ యువతిని రైలులోనే వేధించడం, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో .. జూన్ 22న ఈ సంచలనాత్మక డెసిషన్‌ తీసుకుంది రైల్వే ఏజెన్సీ.

ఈ మధ్య సెంట్రల్ జావా నుంచి జకార్తా వరకు ప్రయాణించిన యువతి పక్కనే కూర్చున్న వ్యక్తి.. పదేపదే ఆమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతని ప్రవర్తనతో విసిగిపోయిన అమ్మాయి.. సీక్రెట్‌గా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇందుకు సంబంధించిన క్లిపింగ్ ట్విట్టర్‌లో 2M వ్యూస్‌తో వైరల్ కావడంతో.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రైల్వే ఏజెన్సీ అలాంటి వారిని బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది.

'ప్రజా రవాణాలో లైంగిక వేధింపులు ప్రధానసమస్యగా మారుతున్నాయి. దీన్ని అంతం చేయడానికి ఎటువంటి దృఢమైన ప్రయత్నం కనిపించలేదు. PT KAI ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నందుకు అభినందిస్తున్నాం' అని సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed